Top News

MLA PSR Visits | ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పర్యటన

 


•బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పర్యటన  

•దేవాలయాల సందర్శన, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని "తెలంగాణ తిరుమల దేవస్థానం" శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు డా. పోచారం రవీందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం నసురుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి గ్రామంలో లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరయ్యారు. తన చేతుల మీదుగా ఇళ్లను ప్రారంభోత్సవం చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

నసురుల్లాబాద్ మండలం మైలారం తాండలో నిన్న వివాహం జరిగిన నూతన వధూవరులు మాలోత్ గన్ను కుమారుడు రాహుల్, నిషా దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక గురువులు శ్రీ శ్రీ శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ ఆంజనేయ శివ పంచాయతన నవగ్రహ ధ్వజ ప్రతిష్ట మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










Post a Comment

Previous Post Next Post