Top News

Heavy Heat | ఎండల జోరు... ఉక్కపోత హోరు

•ఎండల జోరు.. ఉక్కపోత హోరు

•కామారెడ్డి జిల్లాలో 45.8°C - రెడ్ వార్నింగ్ జారీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

కామారెడ్డి జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. TGDPS నివేదిక ప్రకారం సోమవారం ఉదయం 8:30 నుంచి మంగళవారం ఉదయం 8:30 వరకు జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యాయి.

రెడ్ వార్నింగ్ జారీ

జిల్లాలోని భిచ్కుంద, పిట్లం ప్రాంతాల్లో అత్యధికంగా 45.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఎలుపుగొండ, మేనూర్‌లో 45.5°C, బిబిపేట్‌లో 45.2°C తో రెడ్ వార్నింగ్ పరిధిలో ఉన్నాయి. డొంగ్లి 44.9°C, సోమూర్-భిక్నూర్ 44.8°C, గాంధారి-జుక్కల్-కొల్లూర్ 44.7°C తో ఆరెంజ్ అలర్ట్‌లో ఉన్నాయి.

పంటలకు గండం, రైతులకు వడదెబ్బ

పగలంతా ఎండలు మండిపోతుండడంతో వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుముఖం పడుతున్నాయి. పంట కోతల సమయంలో ఎండల దాటికి తట్టుకోలేక పలువురు రైతులు అస్వస్థతకు గురవుతున్నారు. వడదెబ్బతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

జాగ్రత్తలు అవసరం

ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వడదెబ్బ నివారణపై విస్తృతంగా ప్రచారం చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.






1 تعليقات

إرسال تعليق

أحدث أقدم