మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన
సిద్దపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన, జాకోర-చందూర్ ఎత్తిపోతల ప్రారంభం
స్వాగతం పలికిన పోచారం భాస్కర్ రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 10: రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు.
హెలికాప్టర్‌లో సిద్దపూర్‌కు మంత్రి
ఉదయం 11.25 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్ వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు పూలు జల్లుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు సైతం పూలతో స్వాగతం పలికారు. మంత్రి రాకతో సిద్దపూర్ రిజర్వాయర్ పరిసరాలు సందడిగా మారాయి.
రిజర్వాయర్ పనుల పరిశీలన
అనంతరం సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఎత్తిపోతల పథకం ప్రారంభం
మధ్యాహ్నం 12 గంటలకు రూ. 106 కోట్లతో నిర్మించిన జాకోర చందూర్ ఎత్తిపోతల పథకాన్ని మెయిన్ స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు.
హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇంచార్జి సీపీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, నీటి పారుదల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, సి ఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు
బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











إرسال تعليق