నర్సాపూర్ విద్యుత్ ఏడీ ఏసీబీకి చిక్కారు
రూ.25 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రమణారెడ్డి
ఏసీబీ అధికారుల దాడులతో కలకలం
తెలంగాణ డైలీ న్యూస్, మెదక్:
మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడీ రమణారెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఓ పని కోసం లంచం డిమాండ్ చేశారని బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
రమణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిన ఉంది.



إرسال تعليق