నాగిరెడ్డిపేట యూనియన్ బ్యాంక్‌లో సైబర్ నేరాలపై అవగాహన
ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ సూచన
తెలంగాణ డైలీ న్యూస్, నాగిరెడ్డిపేట: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సోమవారం సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్పీ ఆదేశాలతో అవగాహన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం నాగిరెడ్డిపేట సబ్-ఇన్‌స్పెక్టర్ ఐ.ఏ.భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
టోల్ ఫ్రీ 1930కు కాల్ చేయాలి: ఎస్‌ఐ
సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ సూచించారు. బ్యాంకు అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని, ఎవరికీ ఓటీపీ చెప్పవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలన్నారు.
మాటలు, పాటల ద్వారా అవగాహన
పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి షీ టీమ్ పీసీ శ్రీశైలం, డబ్ల్యూపీసీ సుప్రజ, బ్యాంక్ మేనేజర్ సాగర్ షిండే, బ్యాంక్ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాంక్ కస్టమర్లు పాల్గొన్నారు.



إرسال تعليق