హన్మాజీపేట్‌లో మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ ఎన్నిక
పోతుగంటి లింగం ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేస్తాం: అయ్యాల సంతోష్
అంబేద్కర్, ఫూలే మార్గంలో నడవాలని పిలుపు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ హన్మాజీపేట్ గ్రామ కమిటీని బాన్సువాడ మండల గౌరవ అధ్యక్షులు పోతుగంటి లింగం ఆధ్వర్యంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షునిగా పోతరాజు సాయిలు, అధ్యక్షునిగా పోతరాజు గంగరాజు, ఉపాధ్యక్షులుగా గైని శ్రీనివాస్, పి.తుకారాం, ప్రధాన కార్యదర్శిగా గైని కాశీరాం, సహాయ కార్యదర్శులుగా కె.సుధాకర్, ఏ.భాస్కర్, పి.తరుణ్, బి.సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.సురేష్, కోశాధికారిగా బి.అంజి, సాంస్కృతిక కార్యదర్శిగా కుంట సాయిలు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ ఈ సంఘం మాలల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని గ్రామాలను బలోపేతం చేసి చైతన్యం చేసే దిశగా కృషి చేస్తామని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే మార్గంలో నడవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కార్యదర్శి దొనకంటి పాండురంగం, బాన్సువాడ మండల గౌరవ అధ్యక్షులు పోతురాజు లింగం, కుంట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment