Top News

Counsillors Protest | ఎల్లయ్య చెరువు అక్రమ తవ్వకాలు ఆపాలి: ప్రతిపక్ష కౌన్సిలర్లు


ఎల్లయ్య చెరువు అక్రమ తవ్వకాలు ఆపాలి: ప్రతిపక్ష కౌన్సిలర్లు  

ఆర్డీఓకు వినతిపత్రం అందజేత  

టెండర్ ద్వారా మున్సిపాలిటీకి లాభం చేకూర్చాలని డిమాండ్  

ఇల్లీగల్ లేఅవుట్లు, నాలా కబ్జాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:  

బాన్సువాడ మున్సిపల్ ప్రతిపక్ష కౌన్సిలర్లు గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. 

బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా నిబంధనల ప్రకారం టెండర్ వేసి తవ్వకాలు జరపాలని కోరారు. 

పట్టణంలో ఇల్లీగల్ లేఅవుట్లు, నాలాల కబ్జాలు, బఫర్ జోన్లు వదలకుండా ప్లాట్లు చేయడం, అనుమతి లేని కట్టడాలు జరుగుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. వాటిని వెంటనే నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు.



Post a Comment

Previous Post Next Post