ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
కోటగిరిలో కోటి రూపాయల ఫంక్షన్ హాల్ ప్రారంభం
తెలంగాణ డైలీ న్యూస్, కోటగిరి: నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మీర్జాపూర్ క్యాంప్‌లో ఎస్‌డీఎఫ్ నిధులు రూ.1 కోటితో నూతనంగా నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్‌ను పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. స్థల దాతలు కీ.శే. మిక్కిలినేని నారాయణమ్మ, కీ.శే. మిక్కిలినేని వెంకటరత్నం జ్ఞాపకార్థం ఈ ఫంక్షన్ హాల్ నిర్మించారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి, పోతంగల్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్టీ రామారావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





إرسال تعليق