Top News

BRS Meeting | సభ్యత్వ నమోదు, ఓటర్ రివిజన్‌పై అవగాహన సదస్సు

రేపు బాన్సువాడలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం 

సభ్యత్వ నమోదు, ఓటర్ రివిజన్‌పై అవగాహన సదస్సు  

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేల హాజరు  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇన్సెంటివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్రామ్‌పై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కల్పించేందుకు రేపు అంటే ఈనెల 28న ఆదివారం నాడు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.  ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సమావేశ వివరాలను 'తెలంగాణ డైలీ న్యూస్'తో వెల్లడించారు.  

నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.  

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరుకానున్నారు.  బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ తోట ఆగయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రతి గ్రామం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయన కోరారు.

Post a Comment

أحدث أقدم