అంతర్‌రాష్ట్ర దత్తత ద్వారా కేరళ దంపతులకు అప్పగింత
కలెక్టర్ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియ పూర్తి
శాంతకు 'అద్వికా పి.ఎస్.'గా నామకరణం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 11: కామారెడ్డి జిల్లాలోని బాలసదనంలో సంరక్షణ పొందుతున్న ఒక చిన్నారికి కేరళ రాష్ట్రంలో కొత్త జీవితం ప్రారంభమైంది. అంతర్‌రాష్ట్ర దత్తత ప్రక్రియ ద్వారా చిన్నారిని కేరళకు చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, బాలసదనంలో ఉంటున్న చిన్నారి శాంతను కేరళ రాష్ట్రానికి చెందిన సుర్జన్, వీణీర్హా దంపతులు దత్తత తీసుకున్నారు. దత్తత అనంతరం చిన్నారికి అద్వికా పి.ఎస్. అనే కొత్త పేరు పెట్టారు.
చట్టబద్ధంగా పూర్తయిన ప్రక్రియ
చిన్నారి సంక్షేమం, భవిష్యత్ అభివృద్ధి, కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశం కల్పించే ఉద్దేశంతో చట్టబద్ధమైన అన్ని నిబంధనలను అనుసరించి దత్తత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. దంపతులకు చిన్నారిని అధికారికంగా అప్పగించారు.
================
SIR హెల్ప్ డెస్క్ 1950
ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టరేట్‌లోని 25 రూమ్ నెంబర్ లో ఏర్పాటు చేసిన SIR-2026 హెల్ప్ డెస్క్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్ తో కలసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా మార్పు తదితర అంశాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రజలు హెల్ప్ డెస్క్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే, SIR-2026 ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1950ను సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు.
ప్రజలకు ఎన్నికల సేవలను మరింత చేరువ చేయడం, ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతం అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి (AO), ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.


إرسال تعليق