బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్ సహా 50 మంది
వర్ని మండలం తగిలేపల్లి నేతల చేరికతో బాన్సువాడలో కాంగ్రెస్‌కు జోష్
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. (వీడియో 👇)
తగిలేపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు 50 మంది చేరిక
వర్ని మండల పరిధిలోని తగిలేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అల్లం గంగవ్వ, ఉప సర్పంచ్ వడ్ల గంగా ప్రసాద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లం సాయిలు, ప్రభాకర్, గాండ్ల శ్రీనివాస్, యాదుల్, మ్యాదరి సాయిలు, దర్శనం శంకర్, అన్వర్ హుస్సేన్, బక్క రాములు గార్లతో పాటు సుమారు 50 మంది బాన్సువాడలోని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కండువా కప్పి ఆహ్వానించిన భాస్కర్ రెడ్డి
ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ని మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


إرسال تعليق