తన నివాసం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పోచారం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న బాన్సువాడ పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసం వద్ద మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయలక్ష్మి, బాన్సువాడ పట్టణ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మరియు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జుక్కల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో.....
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు
జుక్కల్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుని నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
===============
బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులు - అమరవీరులను స్మరించుకున్న నాయకులు
బాన్సువాడ, జూన్ 2: బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్ నాయకులు జుబేర్ మాట్లాడుతూ 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కోట్లాది తెలంగాణ ప్రజల కల సాకారమైన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన పోరాటం, నాయకత్వం చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఏఐబీఎస్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, రమేష్ యాదవ్, కౌన్సిలర్లు ఫిరోజ్ ఖాన్, మక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడి శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు అక్బర్, మైనార్టీ నాయకుడు ఇషాక్, నాయకులు గాండ్ల కృష్ణ, మహేష్, సయ్యద్ ఉబెద్, శేఖర్, శివ సూరి, కాసుల బాబు రావ్, సాయులు, గౌస్, మన్సుర్, గంగారాం, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








إرسال تعليق