రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి
కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి ప్రకటన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 13: కామారెడ్డి పట్టణ పరిధిలోని పాత రాజంపేట ఏరియా వేలుమా ఫంక్షన్ హాల్ పై భాగంలో గల రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో ఆచూకీ కోసం రైల్వే పోలీసులు ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం కోరారు.
ఘటన వివరాలు
తేదీ 11 జూన్ 2026 రాత్రి పాత రాజంపేట ఏరియా వేలుమా ఫంక్షన్ హాల్ పై భాగంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తలకు బలమైన రక్త గాయం కాగా, కుడికాలు విరిగింది. ఎడమకాలు చీలమండ కిందికి విరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మృతురాలి ఆనవాళ్లు
మహిళ వయసు అంచనా 40 నుండి 50 సంవత్సరాలు ఉంటుంది. ఎత్తు 5.1 అడుగులు. రౌండ్ ఫేస్, చామన ఛాయా కలర్, నలుపు-తెలుపు మిశ్రమ జుట్టు కలిగి ఉంది. నీలం రంగు, తెలుపు చెక్స్ చీర, నీలం-తెలుపు చెక్స్ బ్లౌజ్, ఆకుపచ్చ రంగు పిట్టికోట్ ధరించి ఉంది. ఎడమ చేయిపై పుట్టుమచ్చ ఉంది. రెండు చిన్న ముక్కుపుడకలు, చెవులకు మూడు చోట్ల చిన్న కమ్మలు ఉన్నాయి.
గుర్తింపు కార్డులు లభ్యం కాలేదుమృతురాలిని గుర్తుపట్టడానికి ఎలాంటి ఐడీ ప్రూఫ్‌లు లభించలేదని రైల్వే ఎస్సై సాధు లింబాద్రి తెలిపారు. ఇప్పటివరకు మృతురాలి గురించి ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని అన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించి మృతురాలి బంధువుల ఆచూకీ తెలిపేందుకు సహకరించాలని రైల్వే ఎస్సై కోరారు. వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్సై ఆఫ్ పోలీస్ కామారెడ్డి సాధు లింబాద్రి సెల్ ఫోన్ నెంబర్ 87126 58614కు సంప్రదించగలరు.


إرسال تعليق