బాన్సువాడ డిపోలో బిఎంఎస్ యూనియన్ 72వ జెండా ఆవిష్కరణ
మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరు
బాన్సువాడ: బిఎంఎస్ యూనియన్ ఆవిర్భావించి ఈరోజుకు 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో బాన్సువాడ డిపో సిబ్బంది, కండక్టర్ అంబాజీ, బిఎంఎస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 72 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో కార్మికుల సంక్షేమం కోసం బిఎంఎస్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.



إرسال تعليق