Fire Awareness | బాన్సువాడలో అగ్ని ప్రమాదాలపై అవగాహన



వేసవిలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : ఫైర్ ఆఫీసర్
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: ఈ రోజు బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం, ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వాడకంపై సిబ్బంది డెమో ఇచ్చారు. బస్‌స్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు, షాపు యజమానులు, ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సూచనలు తెలుసుకున్నారు.
SFO మదన్ మాట్లాడుతూ వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని అన్నారు. గ్యాస్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని,. ప్రమాదం జరిగితే వెంటనే 101కి ఫోన్ చేయాలి’ అని సూచించారు.కార్యక్రమంలో డి. మదన్SFO,జె. సునీల్ కుమార్ ALF,కె. హరి సింగ్ HG,ఆర్. సుధాకర్ HG,
బి. సురేష్HG పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post