Inter Results | సంచలనం సృష్టించిన బాన్సువాడ జీజేసి

#సాధారణ విద్యార్థులతో స్టేట్ ర్యాంకుల వర్షం..!

తెలంగాణ డైలీ న్యూస్,  బాన్సువాడ: ప్రైవేట్ కళాశాలలకు గట్టి పోటీ ఇస్తూ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈసారి సంచలనం సృష్టించింది. సాధారణ కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అద్భుత మార్కులతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం హాట్ టాపిక్‌గా మారింది.

💥 ప్రథమ సంవత్సరం ఫలితాలు:

సాయి వర్షిణి (MPC) – 454/470

మహిమున (MPC) – 447/470

నిదా తహరీన్ (BiPC) – 434/440

నాదియా –416/440

షేక్ అఫిఫా – 432/440

నూరి – 420/440

అస్ర కానం – 405/440

🚀 ద్వితీయ సంవత్సరం ఫలితాలు:

సనా పర్వీన్ (BiPC) – 961/1000

అనన్య – 937/1000

📢 ఈ ఫలితాలతో కళాశాల జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ప్రభుత్వ కాలేజీ అంటే తక్కువ కాదు” అని ఈ విద్యార్థులు నిరూపించారు.

డిజిటల్ ఎడ్యుకేషన్‌కు బాన్సువాడ కాలేజీ బిగ్ స్టెప్

ఈ సంవత్సరం నుంచి పూర్తిగా డిజిటల్ విద్య బోధన అమలు చేయనున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. స్మార్ట్ క్లాసులు, టెక్నాలజీ ఆధారిత బోధనతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించనున్నారు.అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయానికి కారణమయ్యాయి.ఇ ది ఆరంభం మాత్రమే…ఇంకా పెద్ద విజయాలు ముందున్నాయి” అని కళాశాల సిబ్బంది ధైర్యంగా చెబుతున్నారు.






Post a Comment

Previous Post Next Post