👉పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలో రైతుల ధర్నా
👉కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ హామీ
తెలంగాణ డైలీ న్యూస్, జుక్కల్:
తమ ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలు కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆందోళన చెందిన రైతులు ధర్నా చేపట్టారు. తమ జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జొన్నలు కొనుగోలు చేయని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి వద్ద గల రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. తాము పండించిన జొన్నలు కొనుగోలు చేయాలంటూ సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు భారతీయ కిసాన్ సంఘ్ వారు మద్దతు తెలిపారు.
తహసీల్దార్ హామీ:
ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజశేఖర్ ఘటన స్థలికి చేరుకొని రైతులతో మాట్లాడి వారిని సముదాయించి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు.

Post a Comment