👉తక్షణమే పరిశీలించి పరిష్కరించాలి :
అదనపు కలెక్టర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సోమవారం కలెక్టటేట్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అర్జీదారుల నుండి 141 దరఖాస్తులు స్వీకరించారు.
వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన, సంబంధిత శాఖాధికారులతో వాటిని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Post a Comment