Career Guidance | తాడ్కోల్ లో కేరీర్ గైడెన్స్


👉చిన్నప్పటి నుంచే ఉన్నత సాధించే దిశగా అడుగులు వేయాలి

👉సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి: సామజిక కార్యకర్త అయ్యల సంతోష్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

 సోమవారం రోజున ప్రజా పాలనలో భాగంగా తాడ్కోల్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో క్యారిర్ గైడన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త అయ్యాల సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని, APJ అబ్దుల్ కలాం బోధించిన కళలను కనండి వాటిని సాకారం చేసుకోండి అనే విషయాన్నీ గుర్తుచేసుకుని అ దిశగా కృషి చేయాలనీ, జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఎంత ఎక్కువగా సంపాదిస్తే అంతగా  సమాజంలో గౌరవం ఉంటుందని, తల్లి దండ్రుల మాట, ఉపాధ్యాయుల మాటలు వింటేనే జీవితం అందంగా ఉంటుందని అన్నారు. వేసవి సెలవుల్లో సెల్ ఫోన్ కు, సామాజిక మధ్యమాలకు దూరంగా ఉండాలని,ఇళ్లలో ఉండే తోటి విద్యార్థులకు చదువులో సహాయం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ లక్ష్మి భాయి, శివ పార్వతి మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post