Funerals | బాన్సువాడలో సిఐటియు ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అంత్యక్రియలు



తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: 

సిఐటియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం నాయకురాలు నూర్జహన్ శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం నాడు ఆమె స్వగ్రామమైన బాన్సువాడలో అంత్యక్రియను నిర్వహించారు.  ఆమె సోదరుడు, మున్సిపల్ కౌన్సిలర్ ఖలీల్ స్వగృహం వద్ద పార్థివ దేహాన్ని చివరి చూపు నిమిత్తం ప్రజలు, అభిమానుల కోసం ఉంచారు. స్థానిక సంగమేశ్వర కాలనీలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఈద్గాకు తరలించారు. అక్కడ జనజ నమాజు చదివిన అనంతరం కబ్రిస్తాన్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లా నాయకులు, సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల నుంచి సిఐటియు, సిపిఎం, టిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నివాళులర్పించారు. అలాగే జిల్లా నలుమూలల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

*కామ్రేడ్ నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటు*

*సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్*

సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ (43) అనారోగ్యంతో నిజామాబాద్ పట్టణంలోని వెల్నెస్ హాస్పిటల్లో నిన్నటి రోజు (తేది: 11-04-2026)న సాయంత్రం 4-20 ని.లకు ఊపిరితిత్తుల సమస్య, గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు తన స్వస్థలం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కార్యక్రమo నిర్వహించడం జరిగింది 
 నూర్జహాన్ మరణం కార్మిక, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. నూర్జహాన్ మృతి పట్ల సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.


ఈరోజు బాన్స్వాడలో జరిగిన అంతిమ యాత్ర కార్యక్రమంలో భాగంగా పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు 
ఈ సందర్భంగా సిఐటి యొక్క కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ నూర్జహాన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకురాలు, జిల్లాలో బీడీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయితీ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, మిషన్ భగీరథ తదితర కార్మికుల సమస్యల పరిష్కారానికై పోరాటాలు సమరశీలంగా నడిపిన మిలిటెంట్ నాయకురాలు. అన్నిరకాల కార్మికులను ఐక్యంగా సంఘటితం చేయడంలో నూర్జహాన్ పాత్ర మరువలేనిది. ఆమె కార్మిక హక్కులు, రక్షణ కోసం అనేక ఉద్యమాలు నడిపింది. నూర్జహాన్ మరణం నిజామాబాద్ జిల్లా కార్మికవర్గానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. నిజామాబాద్ ట్రేడ్ యూనియన్, ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణంలో కామ్రేడ్ నూర్జహాన్ ముఖ్యమైన పాత్ర నిర్వహించారని అన్నారు

నూర్జహాన్ చిన్ననాటి నుండే వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు ఆకర్షితురాలై అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. తన 8 నెలల పసిబిడ్డతో వరంగల్ సెంట్రల్ జైలులో 18 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపింది. పేదలకు ఇళ్ళు, ఇండ్ల స్థలాలు కావాలని చేసిన భూ పోరాటంలో కూడా పోలీసుల కేసులు, నిర్భంధాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేసింది. కడదాకా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు పాటు పడింది. కార్మికవర్గానికి, ప్రజా ఉద్యమాలకు ఆమె లేని లోటు తీరనిది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నాయకులు వెంకట్ గౌడ్ కొత్త నరసింహులు మోతి రామ్ నాయక్ అరుణ్ రేణుక బాలమణి దొడ్లమోహన్ రవీందర్ దశరథ్ మంద శ్రీనివాస్ కర్రల సత్యం మహాదేవి గౌరీ పల్లవి మంగాదేవి రాజు కమ్మరి సాయిలు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post