Hyderabad Drugs Party | తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీకెండ్ రాగానే నగర పరిసర ప్రాంతాల్లో మత్తు పార్టీలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని తారామతి బారాదరి సమీపంలో నిర్వహించిన ఓ భారీ డ్రగ్ పార్టీని పోలీసులు ఛేదించారు. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఈవెంట్‌పై ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
Hyderabad Drugs Party | తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీకెండ్ రాగానే నగర పరిసర ప్రాంతాల్లో మత్తు పార్టీలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని తారామతి బారాదరి సమీపంలో నిర్వహించిన ఓ భారీ డ్రగ్ పార్టీని పోలీసులు ఛేదించారు. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఈవెంట్‌పై ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.ఈ రిసార్ట్‌లో జరిగిన పార్టీకి దాదాపు 300 మంది వరకు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో ఆకస్మికంగా దాడులు నిర్వహించిన అధికారులు, అనుమానాస్పదంగా ఉన్న 35 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌గా తేలడం సంచలనంగా మారింది.
డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిలో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్‌తో పాటు అభినాశ్ ఫణి, యోగేశ్వర్, బ్రెట్ జాసన్, నిహార్-ఆషి అనే భార్యాభర్తలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు వినియోగించినట్లు నిర్ధారణ అయింది. డీజే జాసన్ సూచన మేరకు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పార్టీకి బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి నగరాల నుంచి యువతీ యువకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు భారీగా హాజరైనట్లు సమాచారం. స్థానికుల కంటే ఇతర నగరాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పార్టీలో డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది? ఎవరు ఈ నెట్‌వర్క్‌కు మాస్టర్‌మైండ్? ఇలాంటి పార్టీలు తరచుగా జరుగుతున్నాయా? అనే కోణాల్లో హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్‌పై ప్రభుత్వ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ఇటువంటి పార్టీలు ఎక్కువ కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది.

إرسال تعليق