బీఆర్‌ఎస్ లక్ష్మీదేవిగూడెంలో గ్రామ కమిటీ ఎన్నిక

 బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ గాదె ఇంద్రారెడ్డి, నీటి సంఘం మాజీ డైరెక్టర్ నోముల బలరాం రెడ్డి, పార్టీ నాయకుడు జిల్కపల్లి బసవయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు.



బీబీనగర్, ఏప్రిల్ 06 : బీబీనగర్ మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సర్పంచ్ గాదె ఇంద్రారెడ్డి, నీటి సంఘం మాజీ డైరెక్టర్ నోముల బలరాం రెడ్డి, పార్టీ నాయకుడు జిల్కపల్లి బసవయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా జిల్కపల్లి బాలరాజ్, ఉపాధ్యక్షుడిగా నోముల మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నోముల ప్రశాంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఉల్లంతల సత్యనారాయణ, కోశాధికారిగా మిర్యాల మహేందర్, సోషల్ కన్వీనర్‌గా ఏర్నాగి కోటయ్యను ఎన్నుకున్నారు. యువజన విభాగం అధ్యక్షుడిగా జాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా కవ్వాడి ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జిల్కపల్లి రవీందర్, సంయుక్త కన్వీనర్‌గా దుర్గం నరేష్, కోశాధికారిగా నోముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికయ్యారు.

Post a Comment

أحدث أقدم