Vanteru Prathap Reddy | బీజేపీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లోనూ సీఎం ఫొటో పెట్టిస్తారా?.. కాంగ్రెస్ శ్రేణులను నిలదీసిన వంటేరు ప్రతాప్ రెడ్డి

 Vanteru Prathap Reddy | గజ్వేల్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

Vanteru Prathap Reddy | గజ్వేల్‌లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

బంద్ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడి చేశారని తెలిపారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు దాడుల సమాచారం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు హామీలపై దృష్టి సారించాలని సూచించారు.

హామీలను మరిచి ప్రతిపక్షాలపై దాడులు చేయడమేంటని వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా వారి ఆఫీసుల్లో మోదీ ఫొటో పెట్టారా అని నిలదీశారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లోనూ సీఎం ఫొటో పెట్టిస్తారా అని ప్రశ్నించారు.

Post a Comment

أحدث أقدم