Police Raid | జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఏడుగురు పట్టివేత

# జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది 

# అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

# జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై నిఘా కొనసాగుతోంది – చట్టపరమైన చర్యలు తప్పవు

# జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసన్నపల్లి  గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7,710 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.

జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి అని,. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే, అది అప్పుల ఊబిలోకి నెడుతూ, చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారితీస్తుందని ఎస్పీ అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత, ఇటువంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలన్నారు.

జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడానికి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.


Post a Comment

Previous Post Next Post