Top News

TTD | స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎంపిటిసి


తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డి

పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి దర్శనం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెద్దపట్లోల శ్రావణి దేవేందర్ రెడ్డి సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.

ఈరోజు ఉదయం 3.00 గంటలకు తన పెళ్లిరోజు సందర్భంగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. గత 11 సంవత్సరాలుగా తన పెళ్లిరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.

తన కుమారుని ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. స్వామివారి సుప్రభాత సేవ దర్శనం ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచిందని, శ్రీవారి ఆలయ ధ్వజస్తంభ దర్శనం మహా అద్భుతంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

అనంతరం రంగనాయక మండపంలో జరిగిన వేద ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొని వేద పండితులచే వేద ఆశీర్వాదం పొందారు.

ఈ కార్యక్రమంలో బోర్లం గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెద్దపట్లోల శ్రావణి దేవేందర్ రెడ్డి, భర్త పట్లోల దేవేందర్ రెడ్డి, కుమారుడు మాస్టర్ పట్లోల నిశాంత్ రెడ్డి, తల్లి పట్లోల విజయమ్మ, బంధుమిత్రులు శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post