Sub Collector's Farewell | సబ్ కలెక్టర్ కు ఘనంగా సన్మానం

•బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి ఫేర్‌వెల్

•కమ్యూనిటీ మీడియా సెంటర్ సభ్యుల ఘన సన్మానం

తెలంగాణ డైలీ న్యూస్ బాన్సువాడ, ఏప్రిల్ 29: బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి ఫేర్‌వెల్ పార్టీని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ కమ్యూనిటీ మీడియా సెంటర్ సభ్యులు సబ్ కలెక్టర్ కిరణ్మయిని శాలువాతో సత్కరించి సన్మానించారు.

సబ్ కలెక్టర్‌గా బాన్సువాడలో పనిచేసిన కాలంలో ప్రజలకు అందించిన సేవలను కమ్యూనిటీ మీడియా సభ్యులు కొనియాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, సమస్యల పరిష్కారంలో కిరణ్మయి చూపిన చొరవ అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మీడియా సభ్యులు ఎరువాల రామకృష్ణారెడ్డి, ఏ. పుష్పావతి, నాగులుగామ సాయిబాబా, ఎండీ హైమద్ హుస్సేన్, అయ్యల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కిరణ్మయి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post