Top News

ACB Raid | జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు


జలమండలి జీఎం కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు

కుప్పలుగా నోట్ల కట్టలు, రూ.100 కోట్ల ఆస్తులు గుర్తింపు  

తెలంగాణ డైలీ న్యూస్,హైదరాబాద్:ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. 

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. మల్లాపూర్‌లోని జీఎం కుమార్ స్వగృహంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఈ దాడులను పర్యవేక్షించారు. 

*స్వాధీనం చేసుకున్న ఆస్తులు:*  

- *నగదు:* రూ.1.10 కోట్లు - కుప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలను లెక్కించేందుకు క్యాష్ కౌంటింగ్ మెషీన్లు తెప్పించారు. 

- *బంగారం:* సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు  

- *రియల్ ఎస్టేట్:* హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్లు, నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి  

- *మొత్తం ఆస్తులు:* మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.100 కోట్లు 

మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాంక్ లాకర్లు తెరిచి తనిఖీ చేయనున్నారు. 

స్థిర, చరాస్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم