Top News

Minister Tummala | అగ్రో ఇండస్ట్రీస్ భూముల పరిరక్షణకు కాసుల కృషి: మంత్రి తుమ్మల ప్రశంస

•అగ్రో ఇండస్ట్రీస్ భూముల పరిరక్షణకు కాసుల కృషి:మంత్రి తుమ్మల ప్రశంస

•వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు 23 ఎకరాలు కేటాయింపు, ఏటా రూ.5 కోట్ల ఆదాయం

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: నాంపల్లిలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్‌లో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. 

తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్‌కు చెందిన భూములను కబ్జాకు గురికాకుండా హైడ్రా అధికారులతో సమన్వయం చేసి పరిరక్షించడంలో చైర్మన్ కాసుల బాలరాజు చూపిన చొరవను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. 


అలాగే సంస్థకు చెందిన 23 ఎకరాల ప్రభుత్వ భూమిని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు కేటాయించారు. దీని ద్వారా సంస్థకు సంవత్సరానికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

ఈ సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరింది. ప్రభుత్వ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. 

ఈ కార్యక్రమంలో వేర్‌హౌసింగ్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్, అగ్రో ఎండీ రాములు, వేర్‌హౌసింగ్ ఎండీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Note : వీడియో కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేయండి 

Post a Comment

أحدث أقدم