•బక్రీద్ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు: కామారెడ్డి కలెక్టర్
•శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
•అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
•మసీదులు, ఈద్గాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
ఈ నెలలో రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా శాంతి భద్రతలు, పండుగ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
మసీదులు, ఈద్గాల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పండుగ సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో, సామాజిక బాధ్యతతో వ్యవహరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో ఎడిఎల్ ఎస్పీ నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق