వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బక్రీద్ సందర్భంగా ముస్లిం డ్రైవర్ల విధులు
ఆ డ్రైవర్లకు దుస్తులు, నగదు ప్రోత్సాహకాలు అందించిన కలెక్టర్
కామారెడ్డి: మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం, లచ్చపేట మహాబాల రైస్ మిల్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ గురువారం సందర్శించి పరిశీలించారు.
Video 👆కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లు, అన్‌లోడింగ్ ప్రక్రియ, రవాణా ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా డ్రైవర్ల కొరత లేకుండా రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలని ఇటీవల రవాణాదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నిరంతర రవాణా సేవలు కొనసాగించాలని ఆదేశించారు.
ముస్లిం డ్రైవర్లను ప్రోత్సహించిన కలెక్టర్
పండుగ సమయంలోనూ వరి ధాన్యం రవాణా సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తూ రైతులకు సహకరిస్తున్న డ్రైవర్ల సేవలను కలెక్టర్ ప్రశంసించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లకు, కొనుగోలు కేంద్రాల్లో రవాణా సేవలందిస్తున్న ముస్లిం సోదరులకు దుస్తులు, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
జిల్లా యంత్రాంగం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రవాణాదారులు, డ్రైవర్లు అభినందించారు. వరి ధాన్యం సకాలంలో తరలింపునకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రవాణాదారులు, డ్రైవర్లు, మిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.




إرسال تعليق