Collector | జనగణనపై అవగాహనకు భారీ మారథాన్


జనగణనపై అవగాహనకు భారీ మారథాన్

ప్రారంభించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

తెలంగాణా డైలీ న్యూస్, నిర్మల్:

దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జనగణనపై అవగాహనకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ పట్టణంలో భారీ మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ మారథాన్‌ను కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రగతి, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రక్రియ అన్నారు. జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక చేపడుతుందని వివరించారు. జనగణన-2027లో భాగంగా ప్రతి పౌరుడు “స్వీయ గణన” పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని కోరారు. అవగాహన లేని వారికి ఇతరులు సహకరించాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సి పి ఓ జీవరత్నం, డి వై ఎస్శ్రీ ఓ కాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న, ఎల్‌డీఎం రామ్ గోపాల్, డీపీఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ పీజీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم