Top News

Edit Option for Acc Cards | అక్రిడిటేషన్ కార్డు దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్

 


•అక్రిడిటేషన్ కార్డు దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్

•తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించిన సమాచార శాఖ 

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు రాష్ట్ర పౌర సంబంధాలు, సమాచార శాఖ ఎడిట్ ఆప్షన్ కల్పించిందని TUWJ IJU జిల్లా అధ్యక్షుడు, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు రజనీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు కొన్ని తప్పులు చేయడం వల్ల దరఖాస్తులను పరిశీలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని సరిచేసుకునేందుకే ఈ అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అన్నీ సరిగా ఉంటే ఎడిట్ ఆప్షన్ లో మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

సరిదిద్దుకోవాల్సిన అంశాలు:  

1. క్యాడర్ మార్పు: నియోజకవర్గ స్థాయిలో జర్నలిస్టులు 'కరెస్పాండెంట్' ఆప్షన్ ఎంచుకున్నారు. దాని స్థానంలో మండల స్థాయి రిపోర్టర్లుగా నమోదు చేసుకోవాలి.  

2. సర్టిఫికెట్ల అప్‌లోడ్: కొందరు విద్యార్హత సర్టిఫికెట్లను సరిగా అప్‌లోడ్ చేయలేదు. మరికొందరు సీనియారిటీని చూపే పాత అక్రిడిటేషన్ కార్డులను అప్‌లోడ్ చేయలేదు.  

3. సబ్మిషన్: అక్రిడిటేషన్ కార్డులు, సర్టిఫికెట్లను సరిగా అప్‌లోడ్ చేసిన తర్వాతే సబ్మిట్ చేయాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఎదుర్కొంటున్న జర్నలిస్టులు ప్రస్తుతం వచ్చిన ఎడిటింగ్ ఆప్షన్‌ను వినియోగించుకొని దరఖాస్తులను సరిగా సమర్పించాలని రజనీకాంత్ కోరారు.

Post a Comment

أحدث أقدم