కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా పాత బాలు నియామకం అందించిన పీసీసీ చీఫ్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా పాత బాలును నియమిస్తూ డీసీసీ అధ్యక్షులు ఆలే మల్లికార్జున్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు.
టీపీసీసీ అధ్యక్షుల నాయకత్వంలో నియామకం
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఈ నియామకం చేసినట్లు,ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సామూహిక దార్శనికతతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అంతర్గత ప్రజాస్వామ్యం, క్షేత్రస్థాయి కార్యకర్తల సాధికారత, సంస్థాగత బలోపేతం అనే సూత్రాలే సంఘటన్ సృజన్ అభియాన్‌కు పునాది అని తెలిపారు.
అంకితభావంతో పనిచేస్తా: పాత బాలు
పార్టీ బలోపేతానికి, ఆశయాల సాధనకు అంకితభావం, చిత్తశుద్ధి, నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పాత బాలు పేర్కొన్నారు.

إرسال تعليق