త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్
బాన్సువాడలో ఘనంగా వేడుకలు
ముస్లింలకు ఎమ్మెల్యే పోచారం శుభాకాంక్షలు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బక్రీద్ పండుగను పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలో ముస్లింలు గురువారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈద్గాలో జామా మసీదు ఇమామ్ మౌలానా మొహమ్మద్ అలీ ప్రత్యేక నమాజ్ చదివించారు. పండుగ విశిష్టత, ఇబ్రహీం అలై సలాం త్యాగం, ఖుర్బానీ ప్రాధాన్యతను ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేక దువా చేశారు.
ఈద్గాకు హాజరైన ఎమ్మెల్యే పోచారం
ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ ఈద్గాకు చేరుకొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పోచారం మాట్లాడుతూ బక్రీద్ త్యాగం, సోదరభావం, పేదల పట్ల దయను నేర్పుతుందన్నారు. అల్లాహ్ ఆజ్ఞకు లోబడి జీవించడం, ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ట్రాఫిక్, శానిటేషన్, తాగునీరు, వీధి దీపాలు వంటి ఏర్పాట్లు మున్సిపల్ శాఖ చేసిందని తెలిపారు. శాంతిభద్రతల కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారని వివరించారు. నియోజకవర్గంలో మైనారిటీల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని అన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
జామా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, మహ్మద్ ఏజాజ్, అలీ బిన్ అబ్దుల్లా, గోపాల్ రెడ్డి, గురువినయ్ కుమార్, నార్ల రవీందర్, మోహన్ నాయక్, కాసుల రోహిత్, నర్సన్న చారి, గౌస్, జంగం గంగాధర్, శేఖర్, కాజీమ్ తదితరులు పాల్గొన్నారు. డి ఎస్పీ, సి ఐ ల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ శుభాకాంక్షలు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు అంజిరెడ్డి, జుబేర్, ఖలీల్, ఫెరోజ్, అక్బర్, ఇసాక్, అతిఫ్, మాకబూల్, సుధాకర్ యాదవ్ తదితరులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.










إرسال تعليق