MLA PSR | బాన్సువాడలో మహిళా సంఘాలకు రూ.8.13 కోట్ల చెక్కుల పంపిణీ


బాన్సువాడలో మహిళా సంఘాలకు రూ.8.13 కోట్ల చెక్కుల పంపిణీ  

మండల మహిళా సమాఖ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెప్మా, సెర్ప్ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాల గ్రామ సంఘాలు, వార్డు సంఘాల అధ్యక్షులు, వీఓఏలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  

మహిళా సమాఖ్య శిక్షణా కేంద్రం ప్రారంభం  

కామారెడ్డి జిల్లాలో దోమకొండ, బాన్సువాడ మండలాలకు మంజూరైన మండల మహిళా సమాఖ్య సాముదాయక నిర్వహణ శిక్షణా కేంద్రాల్లో బాన్సువాడ మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం ప్రారంభించారు.  




రూ.6.13 కోట్ల చెక్కు పంపిణీ  

బాన్సువాడ మండల సమాఖ్య పరిధిలోని 52 మహిళా సంఘాలకు 6 కోట్ల 13 లక్షల రూపాయల చెక్కును మహిళా సంఘాల అధ్యక్షులకు అందజేశారు. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద మంజూరైన 15 మందిలో నలుగురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.  

పట్టణంలో రూ.2 కోట్ల చెక్కు, చీరల పంపిణీ  

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ కాసుల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 10 మహిళా సంఘాలకు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. బాన్సువాడ పట్టణంలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.  

ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్, పట్టణ, గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم