కల్లూరులో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవం
ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి దేవాలయం ఘనంగా ప్రారంభమైంది.
ఎమ్మెల్యే పోచారం చేతుల మీదుగా ప్రారంభం
ఈ ఆలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించారు.
కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు
ప్రారంభోత్సవం అనంతరం జరిగిన శ్రీ బీరప్ప స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పోచారం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కురుమ సంఘం పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.






إرسال تعليق