Top News

MLA PSR | సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే  

వ్యాన్ డ్రైవింగ్ చేసిన పోచారం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: వర్ని మండలంలో నిర్మాణంలో ఉన్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పురోగతిని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం  పరిశీలించారు.  సొంతంగా తన వ్యాన్ ను డ్రైవింగ్ చేసుకొంటూ నిర్మాణ స్థలం వరకు వెళ్లారు.(వీడియో 👇)


నిర్మాణ పనుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

ఎమ్మెల్యే వెంట వర్ని, బాన్సువాడ గ్రామీణ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిద్దాపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.






Post a Comment

أحدث أقدم