మద్నూర్, బిచ్కుంద ఆసుపత్రుల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
తెలంగాణ డైలీ న్యూస్, జుక్కల్: మద్నూర్, బిచ్కుంద మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతల సహకారం, ఐకేఎఫ్ నిధుల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంపౌండ్ వాల్ నిర్మాణం, మంచాల కొరత, స్ట్రెచర్లు, బాత్రూమ్ సౌకర్యాల మెరుగుదల, తాగునీటి సదుపాయం, నర్సింగ్ స్టాఫ్ కొరత వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సమయపాలన, అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్, హాస్పత్రి వైద్యులు, హెచ్డీఎస్ కమిటీ సభ్యులు, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





إرسال تعليق