Peace Committe Meeting | బక్రీద్‌కు శాంతియుత వాతావరణం కల్పించాలి: డీఎస్పీ విఠల్‌ రెడ్డి


•బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం 

•బక్రీద్‌కు శాంతియుత వాతావరణం కల్పించాలి: డీఎస్పీ విఠల్‌ రెడ్డి

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:  

రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ విఠల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బాన్సువాడ పోలీస్ స్టేషన్ అధికారులతో పాటు పట్టణానికి చెందిన హిందూ, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. 




ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ అందరూ సోదరభావంతో మెలిగి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. 

గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు అంజిరెడ్డి, కాసుల రోహిత్, వహబ్, శహాబ్, అసద్ బిన్ మోసిన్, అఫ్రోజ్, లింగం, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم