•బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయాన్ని తరలించాలి
•ప్రభుత్వ పాఠశాల భవనాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి
•ఆర్డీవోకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వినతి
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బిచ్కుంద మున్సిపాలిటీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి జాదవ్ ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం బాన్సువాడ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు చదువుకునే పాఠశాల భవనాన్ని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోందని, తరగతి గదుల కొరత, విద్యా వాతావరణం దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న సమయంలో పాఠశాల భవనాలను ఇతర అవసరాలకు ఉపయోగించడం సరికాదని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి మున్సిపాలిటీ కార్యాలయాన్ని వేరే భవనానికి మార్చాలని, పాఠశాల భవనాన్ని పూర్తిగా విద్యార్థుల వినియోగానికి అందుబాటులో ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు.


إرسال تعليق