Top News

Praja Palana Pragati Pranalika | ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 

ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు  

జ్యోతి ప్రజ్వలన, జయ జయ హే గీతంతో కార్యక్రమం ప్రారంభం  

సత్య కన్వెన్షన్ హాల్‌లో జిల్లా స్థాయి సమీక్ష  

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి: 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్‌లో ప్రారంభమైంది. 

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత్ రావు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. 

జ్యోతి ప్రజ్వలన చేసి, జయ జయ హే తెలంగాణ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పురోగతి, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై సమీక్ష ప్రారంభమైంది. 

సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







Post a Comment

أحدث أقدم