Top News

Rice Mill Inspection | జంగంపల్లి శాకంబరి రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్

జంగంపల్లి శాకంబరి రైస్ మిల్లును తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్  

ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని ఆదేశం  

పీపీసీల వద్ద పెండింగ్ తగ్గించాలని అధికారులకు సూచన  

85 శాతం బాయిల్డ్ రైస్ అలొకేషన్‌పై మిల్లర్ సంతృప్తి  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:  

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బుధవారం జంగంపల్లి గ్రామంలోని శాకంబరి రైస్ మిల్లును సందర్శించి ధాన్యం కొనుగోలు, అన్‌లోడింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. 

పీపీసీల వద్ద పెండింగ్ తగ్గించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పీక్ ప్రొక్యూర్‌మెంట్ సీజన్ కావడం, వర్షాల అవకాశం ఉన్నందున అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వాహనాల క్లియరెన్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 



హెడ్ ఆఫీస్ నుంచి సుమారు 85 శాతం బాయిల్డ్ రైస్ అలొకేషన్ ముందుగానే అందినందుకు మిల్లర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్‌లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి, డీఎం సివిల్ సప్లైస్, తహసీల్దార్, డీటీసీఎస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post