నిర్మల్ జిల్లాలో గంజాయి కలకలం: వ్యక్తి అరెస్ట్, కిలో సరుకు స్వాధీనం
బీహార్ నుంచి తెచ్చి ఖానాపూర్‌లో విక్రయం
రూ.1లక్ష విలువైన గంజాయి, మొబైల్ సీజ్
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు: డీఎస్పీ శ్రీనివాస్
తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రామరెడ్డిపల్లి బస్ స్టాప్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ పాస్వాన్‌గా గుర్తించారు. నిందితుడు బీహార్ నుంచి గంజాయి తీసుకువచ్చి ఖానాపూర్ ప్రాంతంలో చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
దాడిలో నిందితుడి వద్ద నుంచి రూ.1లక్ష విలువైన కిలో గంజాయితో పాటు ఒక రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాల వ్యాపారం, సరఫరా, గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్‌ఐ రాహుల్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ డా. జి. జానకి షర్మిల అభినందించారు.

Post a Comment