Top News

13th Ward Meeting | బాన్సువాడలోని 13వ వార్డులో రేపు వార్డు సభ

బాన్సువాడలోని 13వ వార్డులో రేపు వార్డు సభ  

టీచర్స్ కాలనీ వడ్ల సంఘం వేదికగా ఉదయం 10 గంటలకు ప్రారంభం  

99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా నిర్వహణ  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 7: రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో సోమవారం వార్డు సభ నిర్వహించనున్నారు.  

జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి టీచర్స్ కాలనీ వడ్ల సంఘం వేదికగా జరిగే ఈ సభ వివరాలను వార్డు కౌన్సిలర్ ఎం.ఏ. ఖలేక్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ఆదివారం వెల్లడించారు.  

ప్రజా ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వార్డు సభ ద్వారా 13వ వార్డు ప్రజలు తమ సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు నేరుగా తెలియజేయవచ్చని వారు తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

13వ వార్డు ప్రజలందరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కౌన్సిలర్ ఖలేక్, కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

أحدث أقدم