•రాజారాం దుబ్బలో బాల కార్మిక నిర్మూలనపై అవగాహన
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 14: తాడ్కోల్ పరిధిలోని రాజారాం దుబ్బలో ఆదివారం ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల కార్మిక నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సామాజిక కార్యకర్త అయ్యాల సంతోష్ మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులను పనికి పంపడం, పనిలో ఉంచడం లేదా బాల కార్మికులుగా ఉంచడం చట్టరిత్య నేరమని తెలిపారు. 18 సంవత్సరాలు నిండే వరకు విద్యను అభ్యసించడం బాలల హక్కు అని స్పష్టం చేశారు.
పిల్లలను బాల కార్మికులుగా తయారు చేస్తే తల్లిదండ్రులకు మరియు యజమానులకు చట్టారీత్యా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
విద్యార్థులను చదివించడం భారంగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, గురుకుల, కస్తూరిబా, మోడల్, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. అందుకు ASR ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కవులు రాజు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment