Fake Audio Clip | అది ఫేక్ ఆడియో క్లిప్': టీపీసీసీ షోకాజుకు షబ్బీర్ అలీ వివరణ


'అది ఫేక్ ఆడియో క్లిప్': టీపీసీసీ షోకాజుకు షబ్బీర్ అలీ వివరణ  

'నా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే కుట్ర' అని ఆరోపణ  

పోలీసులకు ఫిర్యాదు చేశానన్న మాజీ మంత్రి

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో,  హైదరాబాద్, జూన్ 14: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజు నోటీసులపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. వైరల్‌గా మారిన ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని, అది ఫేక్ ఆడియో క్లిప్ అని స్పష్టం చేశారు.

'కుట్రపూరితంగా సృష్టించిన క్లిప్'  

తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే కల్పితమైన ఆడియోను సృష్టించారని షబ్బీర్ అలీ ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.

పోలీసులకు ముందే ఫిర్యాదు  

క్రమశిక్షణ కమిటీ వివరణ కోరడానికి ముందే ఈ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

'మహేశ్ గౌడ్ సోదరుడిలాంటివాడు'  

టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తనకు సోదరుడిలాంటి వాడని, అతని గురించి ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.

45 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కట్టుబడి ఉన్నా  

45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, పార్టీకి నష్టం కలిగించే పనులు ఏమాత్రం చేయనని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కుట్రధారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే బయటపెడతానని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని కోరారు.


ఏఐసిసి జాతీయ అధ్యక్షుని కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ..

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ శనివారం కలవడం జరిగింది. బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Post a Comment

Previous Post Next Post