ప్రత్యేక గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
136 గ్రామపంచాయతీలలో గ్రామసభలు – జయజయహే తెలంగాణ గీతంతో ప్రారంభం
వర్షాకాలం ముందస్తు చర్యలు, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 532 గ్రామపంచాయతీలలో విడతల వారీగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో గ్రామసభలు నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గొట్టుముక్కులలో కలెక్టర్ పర్యటన
గురువారం జిల్లాలోని 136 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామసభ జయజయహే తెలంగాణ గీతంతో ప్రారంభమైంది.
వర్షాకాల ముందస్తు చర్యలకు ఆదేశం
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, తాగునీటి వనరులు, వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
వ్యర్థాల నిర్వహణకు 4 రంగుల బుట్టలు
ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్–2026ను గ్రామపంచాయతీలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. గ్రీన్ బుట్టలో తడి వ్యర్థాలు, బ్లూ బుట్టలో పొడి వ్యర్థాలు, రెడ్ బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామపంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు గ్రామసభల ద్వారా ఎంపిక
తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, SIR-2026, పంటల మార్పిడి, బడిబాట, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పించారు. అర్హులైన లబ్ధిదారులను గ్రామసభల ద్వారా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రైతులు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు.
----------------------
బిక్నూర్‌లో మహిళలకు ఉచిత రక్త పరీక్షలు ప్రారంభం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కలెక్టర్ ప్రారంభం
బిక్నూర్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బిక్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు.
రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్, రక్త పరీక్షల తీరును పరిశీలించారు. రక్తహీనత వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందాలని మహిళలకు సూచించారు. మహిళా సంఘాల సభ్యులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్, సర్పంచ్, తహసీల్దార్, DRDO దామోదర్ రెడ్డి, adl DRDO విజయలక్ష్మి, మండల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
---------------------
వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి: అదనపు కలెక్టర్ విక్టర్ గురువారం కామారెడ్డి మండలం పాత రాజంపేట గ్రామం PACS వరి కొనుగోలు కేంద్రాన్ని DCSO, DMCS, DCOతో కలిసి తనిఖీ చేశారు.
అనంతరం తాడ్వాయి మండలం డెమికలాన్ గ్రామంలోని PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని DCOతో కలిసి పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.






إرسال تعليق