Top News

Cyber Crime | సైబర్ నేరగాళ్ల వలలో యువకుడు: ఖాతా నుంచి రూ.95 వేలు మాయం

సైబర్ నేరగాళ్ల వలలో యువకుడు: ఖాతా నుంచి రూ.95 వేలు మాయం  

వాట్సాప్ లింక్ క్లిక్ చేసి వివరాలు ఇచ్చిన బాధితుడు  

19 నిమిషాల్లో ఆరుసార్లు నగదు డ్రా, పోలీసులకు ఫిర్యాదు  

తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్: సైబర్ నేరగాళ్ల మోసంతో ఓ యువకుడి ఖాతాలో నుంచి రూ.95 వేలు మాయమైంది. దీంతో బాధితుడు బీర్కూర్ పోలీసులను ఆశ్రయించాడు.  

ఆర్టీఏ చలాన్ లింక్‌తో మోసం  

వివరాల్లోకి వెళితే.... బీర్కూర్‌కు చెందిన మజర్ అనే యువకుడు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మే 2న ఓ వాట్సాప్ గ్రూపులో ఆర్టీఏ చలాన్ ఏపీకే లింక్ వచ్చింది. సదరు యువకుడు ఆ లింక్‌ను క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నమోదు చేశాడు.  

లక్ష రూపాయలు జమ చేసిన మరుసటి రోజే  

జూన్ 3న మజర్ తన ఖాతాలో రూ.లక్ష నగదు జమ చేశాడు. జూన్ 6న సాయంత్రం 6:30 గంటలకు తన ఖాతాలో నుంచి ఆరు విడతలుగా 19 నిమిషాల వ్యవధిలో రూ.95 వేలు నగదు మాయం చేసినట్లు సెల్ ఫోన్ కు సందేశాలు వచ్చాయి.  

పోలీసులకు, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీకి ఫిర్యాదు  

గమనించిన యువకుడు వెంటనే బీర్కూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

గుర్తుంచుకోవాల్సిన విషయాలు  

1. తెలియని లింక్‌లు క్లిక్ చేయవద్దు: వాట్సాప్, ఎస్ఎంఎస్‌లలో వచ్చే ఆర్టీఏ చలాన్, కేవైసీ అప్‌డేట్, లాటరీ ఏపీకే లింక్‌లను క్లిక్ చేయకూడదు.  

2. బ్యాంక్ వివరాలు ఇవ్వవద్దు: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్, మెసేజ్ ద్వారా ఓటీపీ, పిన్, సీవీవీ అడగవు.  

3. 1930కు కాల్ చేయండి: సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బు వెనక్కి వచ్చే అవకాశం ఉంది.



Post a Comment

أحدث أقدم