కామారెడ్డి ప్రధాన జిల్లా న్యాయమూర్తిగా పి. ముక్తిద బాధ్యతల స్వీకరణ
పోక్సో కోర్టు న్యాయమూర్తిగా, డీఎల్ఎస్ఏ చైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు
కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 25: తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టు జారీ చేసిన బదిలీ, నియామక ఉత్తర్వుల మేరకు శ్రీమతి పి. ముక్తిద గురువారం ఉదయం కామారెడ్డి ప్రధాన జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆమె కామారెడ్డి I అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించడానికి ముందు గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి కామారెడ్డిలోని ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదాలను పొందారు.
శ్రీమతి పి. ముక్తిద ఇంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలో I అదనపు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహించి, అక్కడి నుండి కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా న్యాయాధికారులు డా. సూరా సుమలత, కె. సుధాకర్, బి. దీక్ష, ప్రధాన పరిపాలనా అధికారి పి. రాంచందర్ రావు, ఉషారాణి, సిబ్బంది, సభ్యులు జె. భుజంగరావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, కరుణ, మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, ప్రభుత్వ న్యాయవాది శ్యాం గోపాల్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇతర న్యాయవాదులు మరియు జిల్లా న్యాయ వ్యవస్థ సిబ్బంది గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు.

Good information
ردحذفإرسال تعليق