Top News

Illegal Affairs | వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆర్మీ జవాన్ దారుణ హత్య

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆర్మీ జవాన్ దారుణ హత్య  

మెదక్‌లో భార్య, అత్తమామ, బావమరిది ఘాతుకం  

హత్య అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు  

మెదక్, జూన్ 8: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ ఆర్మీ జవాన్‌ను భార్య, అత్తమామ, బావమరిది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే, ఉత్తరాఖండ్‌లో ఆర్మీ విధులు నిర్వహిస్తున్న పొన్నం కుమార్ ప్రస్తుతం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 10న తిరిగి విధులకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంట్లో మరో మహిళతో ఏకాంతంగా ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య, అత్తమామ, బావమరిది కలిసి కుమార్‌పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  

హత్య అనంతరం నిందితులు నేరుగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

సెలవులపై వచ్చిన జవాన్ హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Post a Comment

أحدث أقدم